Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వైసీపీకి వరుపుల సుబ్బారావు బిగ్ షాక్: పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు.
అనంతరం, కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా, ఇటీవలె ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ నేత మజ్జి శ్రీనివాస్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఈ వరుస రాజీనామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
Tags:#Andhra Pradesh#National#Shorts




